మొగుడి మంచితనం సంవత్సరం కాపురం చేసిన నాకంటే నాలుగు సార్లు కలిసిన నీకు బాగా అర్థం అయ్యిందా అంది లావణ్య. ఐనా మంచివాడు చెడ్డవాడు అన్నది సమస్య కాదు, అక్కని పెళ్లి చేసుకుని విడిపోయినవాడితో నీకు ప్రేమ ఏంటి. చదువు మానేసి అతని వెనక పడుతున్నావ్ అనే రప్పించింది, పెళ్లి సంబంధం చూసింది అన్నాడు రాఘవ. నాకు ఇష్టం లేదు, నేను బావని ప్రేమిస్తున్నా అంది శ్రీజ. ఒసేయ్! మంచివాళ్ళు కథల్లో, సినిమాల్లో,ఇంకా దూరంగా చూడటానికి బాగుంటారు కానీ కలిసి బ్రతకడానికి కాదు అంది లావణ్య. ఒక్కసారే కళ్ళు పెద్దగా తెరిచి చూసింది శ్రీజ, కళ్ళు ఎరుపుగా ఉండడం వల్ల రౌద్రం కనపడుతోంది ఆమె కళ్లలో. నిజానికి ఆమె కళ్ళు చూసి అందరికి భయం వేసింది. నాన్నా! నేను అడిగానా మిమల్ని డాక్టర్ చదివించమని, మీరు చదవమన్నారు.
Hinweis: Dieser Artikel kann nur an eine deutsche Lieferadresse ausgeliefert werden.
Hinweis: Dieser Artikel kann nur an eine deutsche Lieferadresse ausgeliefert werden.