చిన్నతనం నుండి పుస్తకాలు, పత్రికలు వగైరా చదవడం అంటే ఇష్టం. అదే మెదడులో మాతృ భాషని పదిలం చేసింది. మంచి రచనలని ఆస్వాదించే అభిరుచి ఏర్పడింది. మనమూ రాయచ్చా? - చిటారు కొమ్మన చిగురులు మళ్ళీ మళ్ళీ తొడిగిన ఆశ!అమ్మో...మన కథలు ఎవరు వేస్తారు? - వెంటనే పీక నొక్కేసే అంతర్వాణి!కానీ, ఎక్కడో మిణుగురు పురుగు లాగా అంధకారంలో అప్పుడప్పుడు వెలిగే ఒక ఆశావహం నా కథ పత్రికలో అచ్చులో కనపడితే, అది ఎంత గొప్ప అనుభూతి, సామర్థ్యం, విజయం!వ్యక్తికి తొలిప్రేమ మధురమైనది - మది తలచిన ప్రతిసారి.తల్లికి తొలి చూలు ఆనందకరమైనది - ఒడి నిండినప్పుడు.రచయితకు తొలి ముద్రణ మురిపించేది - చేతికి చేరినప్పుడు.మొదటి రెండింటికీ సమయం అనే కంట్రోల్ బటన్ ఒకటి ఉంటుంది.కథకులకు వ్యామోహం, రాసే శక్తి ఉంటే చాలు, ఎంత లేటు వయసులోనైనా రచనా ప్రక్రియ మొదలుపెట్టే సౌలభ్యం - అందుకు నేనే ఉదాహరణ.తరిమే నా ఆలోచనలను నాలుగు అంశాల క్రింద - కథలుగా, కిర్ కిర్ తలపులు (కవితలు) గా, బేబీ టపాస్ (హాస్య గుళికలు) గా, మరియూ చిన్నా - చితకా (ప్రశ్న - జవాబు) గా, కూర్చుకుంటూ సాగుతున్నాను.నా ఇంటిపేరులో నుండి ఒక అక్షరం, నా పేరులో నుండి మరొక అక్షరం తీసుకొని నా కలం పేరును, రా శా. అని నామకరణం చేసుకున్నాను. చదువుతున్న కాసేపూ ఆసక్తి కలిగించి పుస్తకం మూసి ప్రక్కన పడేయకుండా ఉండే రచనలు చెయ్యాలని నా ప్రయత్నం. అంతే వేరే ఏ ఆశలూ, ఆశయాలు పెట్టుకోకుండా ముందుకు సాగగలనని నమ్ముతూ చేసే ప్రక్రియ మాత్రమే నా రచనలు!(రాయప్రోలు వెంకట రమణ శాస్త్రి)
Bitte wählen Sie Ihr Anliegen aus.
Rechnungen
Retourenschein anfordern
Bestellstatus
Storno