"ప్రభాత కాంతిలో నీ సున్నితమైన దేహాన్ని తడిపి తడిపి నీలి శిరోజాల్ని జగమంతా పరిచి పరిచి నీ నీడలో నా నీడ కలిసే మధురక్షణం కోసం మన కలల జలతారుని కప్పుకుని నిశ్శబ్దంగా నాకోసం జపిస్తూ తపిస్తూన్న ప్రియా! నీ సుదీర్ఘ లేఖలన్నీ అందాయి… యుగయుగాలుగా నాకోసం వేచి చూస్తున్న నిన్ను శరవేగంతో వచ్చి అందుకుని నీ గాఢ పరిష్వంగంలో ఐక్యం అయ్యి, నీలో నేనుగా, నాలో నువ్వుగా జీర్ణమయ్యి నీ చిలిపి కలహాల్ని ఆరగించి, నీ విరహ వేదనని శ్వాసించి, క్రమించి, రమించి, ఉపశమించి, అలసతతో దగ్థమై, ఒక విశేషమూర్తిగా రూపాంతరం చెందాలని నా తపన, యాతన, వేదన. దేవుడిచ్చిన విలువైన వరానివైన నిన్ను పెంచుకోవాల్సింది, నీతో జీవితం పంచుకోవాల్సిందీ నువ్వు వుంటున్న ఆ ఇంట్లోకాదు- మనవూరి నదిలో ఎన్నోమైళ్ళు ప్రయాణం చేస్తే కనిపించే నిర్జనమైన, ఎత్తయిన పాపికొండల సమూహం దిగువున దర్శనమిచ్చే మైదానంలో మనమిద్దరమే శ్రమించి నిర్మించుకుందాం అందమయిన కుటీరాన్ని. దానిచుట్టూ వెన్నెల వృక్షాల్ని పాతుకుందాం. నక్షత్రాల్ని పువ్వులుగా పూయించుకుని, శతకోటి చందమామల్ని ఫలాలుగా పండించుకుందాం. తొలకరి జల్లుని, వణికించే చలిని, వెచ్చని సూర్యుడ్నీ అవసరమయినప్పుడు పిలుచుకుందాం. గ్రీష్మంతో పనిలేదని చెప్పేసి వసంతంతోనే బంధుత్వం పెంచుకుందం. ఎన్నోఏళ్ళుగా ఎదురుచూస్తున్న ప్రియుడు ఎన్నో వందలమైళ్ళ దూరం నించీ ఆమెకు రాసిన ప్రేమలేఖ అది. అనుభూతుల్ని ఆహారం చేసుకుని బతుకుతున్న ఆమె పేరు రాధ." "O Beloved, day-dreaming of that day when our shadows become one, as your most delicate body basks in the light of dawn, with the braid of your hair spreading across the universe, you covered yourself in the blanket of our fantastic unison. As you wait for my arrival through ages, I long to meet you at once, embrace you with an unbeknownst intensity, merging our selves, you becoming me and me becoming you, as I consume those mischievous conflicts, and breath the melancholy of your suffering, as I lust you and release myself into you, and extinguish in exhaustion - such is my desperation, craving. We shall build our own beautiful home at the deserted foot of the hill-ranges of Papi Kondalu. That is where you belong.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.