కొన్ని నవలలు పరిచయం చెయ్యాలంటే అదృష్టం ఉండాలి. ఎందుకంటే, ఆ నవల పాఠకుడ్ని తనతో పాటు నడిపించేంత గొప్పగా ఆ రచయిత 'నిర్మించాడని' అర్థం. ఈ 'జరుగుతున్న జగన్నాటకం' నవల కేవలం అక్షరాల కూర్పు కాదు. రెండు ప్రపంచాల మధ్య అద్భుతంగా కట్టబడిన వారథి. ఆ వారథిని నిర్మించిన అక్షరశిల్పి శ్రీ సత్యప్రసాద్ గారు. ఈ కథ చాలా చిత్రంగా మొదలౌతుంది. ముగ్గురు స్నేహితుల మధ్య మొదలవుతుంది. హైదరాబాద్ నగరశివారుల్లో జరిగే ఒక రేవ్ పార్టీలో, ఒకరు ప్రసాద్, రెండు మూర్తి, మూడు సారథి. పార్టీలో ఉన్న సారథి అనుకోని పరిస్థుతుల్లో సవ్యలంకలో తేల్తాడు. అదో కొత్త లోకం. ఆ రెండు ప్రపంచాల మధ్యనున్న వారథే ఈ సారథి. అంతేకాదు - పార్థసారథి, ఈ పుస్తకంలో ఖగోళశాస్త్రముంది. జీవశాస్త్రముంది. అనేకానేక సిద్ధాంతాల ప్రతిసిద్ధాంతాల చర్చవుంది. తప్పొప్పుల విచారణ వుంది. మానవ మస్తిష్కపు ఆవిష్కరణ ఉంది. 'ఇది నిజమే, ముమ్మాటికీ నిజమే' అని సమ్మోహనంగా పాఠకుడిని నమ్మించే 'కల్పనా చాతుర్యం' ఉంది.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.