ఎం వీ ఆర్ రాసిన కాశ్మీర్ కథ అనే పుస్తకానికి తరువాయి భాగమే ఈ 'కాశ్మీర్ వ్యధ'. కాశ్మీర్ కథ లో శాస్త్రి వాజపేయి-ముషారఫ్ ల నడుమ షిమ్లా ముషాయిరా నేపథ్యం లో కాశ్మీర్ సమస్య పూర్వాపరాలను విశ్లేషించారు. ఇటు ఇండియా కి అటు పాకిస్థాన్ కి మధ్య లో ఉంది కాశ్మీర్. ఎన్నో ఏళ్లుగా కాశ్మీర్ సమస్య మురుగుతూనే ఉంది. కాశ్మీర్ సమస్య నడుమ ఆనాటి రాజకీయ పరిస్థితులని, స్థితిగతుల్ని, ఆజాద్ కాశ్మీర్ అంశాన్ని సుస్పష్టంగా విశ్లేషిస్తూ సీరియస్ గా చేసిన రచన కాశ్మీర్ వ్యథ. ఎన్నో కీలక అంశాలను లోతుగా అధ్యయనం చేసి మన ముందుకు తెచ్చారు శాస్త్రి. సీరియస్ విషయాలను సీరియస్ గా చర్చించినందువలన ఈ పుస్తకానికి రీడబిలిటీ తక్కువ అని ఆయన అభిప్రాయం.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.