"రూపాయి చెప్పిన బేతాళ కథలు సంపాదనను సంపదగా మార్చే రహస్యాలు చెప్పే కథలు ఇందులో మూడు భాగాలు - ఆర్థిక అక్షరాభ్యాసం, ఆదాయ-వ్యయాలు, పొదుపు-మదుపు. ఇందులో మధ్యతరగతి విక్రమార్కుడుంటాడు. పట్టు వదలని ఈ విక్రమార్కుడు ఏటీయం వద్దకు వెళ్లి అందులో నుండి డబ్బులు డ్రా చేసి సంపద సాధించే దిశగా నడుస్తుంటాడు. అప్పుడు డబ్బుల్లో వున్న బేతాళుడు బయటికి వచ్చి మధ్య తరగతి విక్రమార్కుడికి కథ చెప్తాడు. ఆ కథలోనే ఒక ఆర్థిక పాఠం నేర్పిస్తాడు. సంపాదన పెంచుకోవడం గురించి, ఖర్చులు తగ్గించుకోవడం గురించి, డబ్బు దాచుకోవడం గురించి మొత్తం నలభై కథలు. సేవింగ్స్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్… ఒకటేమిటి? ఆర్థిక ప్రణాళికకు అవసరమైన అన్ని సంగతులు కథలు కథలుగా చెప్తాడు బేతాళుడు. అవన్నీ మీరు చదవాలి. సంపాదన నుంచి సంపద సాధించే వైపు అడుగులు వెయ్యాలి. ఇదే ఈ పుస్తకం వెనుక ఆశయం. ఆశ కూడా! "
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.