ఒక కథలపుస్తకం చదివితే అందులో అందమైన ప్రేమకథో, వినోదమో, అడ్వెంచరో, వైజ్ఞానికమో..ఏదో ఒకటి అందుతుందని చదవాలనిపించే పుస్తకం మాత్రం ఖచ్చితంగా సాహిల్ వస్తాడు కాదు. అలా చదివి అలా వదిలేసేది కాదు. చదివి ఇదింతేలే అనుకునేదీ కాదు. ఒక పుస్తకం చదివాక అది మనల్ని అంటిపెట్టుకుని ఉంటే ..ఒక పుస్తకం చదివాక అది మనకు సజీవ చిత్రాన్ని చూపించ గలిగితే ..ఒక పుస్తకం చదివాక అది మనలోని నెగెటివిటీని తీసి వేయగలిగితే అది ఖచ్చితంగా ఒక గొప్ప పుస్తకం . ఆ కోవలోకి చెందిన పుస్తకమే 'సాహిల్ వస్తాడు'. సాహిల్ వస్తాడులో మొత్తం 11 కథలున్నాయి. సాహిల్ వస్తాడులో కథల పాత్రల ఎంపిక ప్రత్యేకంగా ఈ పాత్ర ఇలా ఉంటుందని నిర్దేశించినట్లుగా ఉండవు. అసలు పాత్రలుగానే అనిపించవు. మన పక్కింట్లోనో మన ఎదురింట్లోనో మనతో మాట్లాడుతున్న అనుభూతిని కలిగించే సజీవ రూపాలే. ఒక్కొక్క పాత్ర పరిచయం చేసే విధానంలో అఫ్సర్ గారి ప్రతిభ మనతో కాజువల్ గా చెబుతున్నట్లుగా నిజానికి మనతో మాట్లాడుతున్నంత సహజంగా ఉంటాయి.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.